సింధూర పువ్వు కృష్ణారెడ్డి ఇండస్ట్రీలో ఫేమస్ ప్రొడ్యూసర్. ఆయన తనయుడు నాగాన్వేష్ 'వినవయ్యా రామయ్యా' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు. కాని ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలమవుతున్నా.. ఇప్పటివరకు అన్వేష్ తన రెండో సినిమాను మాత్రం ఫైనల్ చేయలేదు. సుమారుగా అరవైకు పైగా కథలు విన్న ఈ యువ హీరోకు బాహుబలి సినిమాకు సహాయకుడిగా పని చేసిన పళని చెప్పిన కథ బాగా నచ్చిందట. వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన చాలా మంది దర్శకులుగా మారిన సంగతి తెలిసిందే. కాని వారిలో కొందరు మాత్రం సక్సెస్ కాగలిగారు. మరి పళని ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. నిర్మాత.. హీరోయిన్.. ఎవరనే విషయాలు తెలియాల్సివుంది..!