Advertisementt

ఈ యంగ్‌హీరోకి అతి ఎక్కువైంది!

Sat 07th May 2016 05:53 PM
rajtarun,raj tarun over action,dil raju,madhura sridhar  ఈ యంగ్‌హీరోకి అతి ఎక్కువైంది!
ఈ యంగ్‌హీరోకి అతి ఎక్కువైంది!
Advertisement
Ads by CJ

మంచి లక్‌తో పాటు దర్శకత్వంలో, కథా, స్క్రీన్‌ప్లే విషయాల్లో మంచి పట్టున్న యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌. ఆయన నటించిన 'ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్‌, ఈడో రకం.. వాడోరకం' చిత్రాలు మంచి సక్సెస్‌ సాధించాయి. 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' చిత్రం మాత్రం నిరాశ పరిచింది. కాగా ఆయనతో దిల్‌రాజు.. వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని భావించాడు. మొదట్లో ఈ చిత్రాన్ని సాయిధరమ్‌తేజ్‌తో చేయాలని భావించిన దిల్‌రాజు ఆ తర్వాత ఈ చిత్రాన్ని రాజ్‌తరుణ్‌ తీయాలని డిసైడ్‌ అయ్యాడట. కానీ రాజ్‌తరుణ్‌ ఈ చిత్రం విషయంలో చెబుతున్న మార్పులు చేర్పులు చూసి దిల్‌రాజు ఆయనను వద్దనుకొన్నాడని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇదే చిత్రాన్ని శర్వానంద్‌తో తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇక రాజ్‌తరుణ్‌తో పెద్ద వంశీ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేయాలని మధురశ్రీధర్‌ భావించాడు. కానీ డైరెక్టర్‌ని మార్చాలని, స్టోరీలో మార్పులు చేయాలని రాజ్‌తరుణ్‌ చేస్తున్న తలనొప్పిని భరించలేని మధుర శ్రీధర్‌ కూడా ప్రస్తుతం మరో హీరో కోసం వెతుకుతున్నాడట. ఈ విషయంలో రాజ్‌తరుణ్‌ అతికి పోకుండా ఉంటేనే ఆయనకు నాలుగు కాలాల పాటు భవిష్యత్తు ఉంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ