Advertisementt

టాలీవుడ్ కి విలన్ల కొరత తీరినట్టేనా!

Sat 07th May 2016 06:59 PM
tollywood,villains,aadi pinisetty,tarak ratna,rajasekhar,sudheer babu,telugu villains  టాలీవుడ్ కి విలన్ల కొరత తీరినట్టేనా!
టాలీవుడ్ కి విలన్ల కొరత తీరినట్టేనా!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ ఎప్పటినుండో హీరోయిన్ల కొరత, విలన్ల కొరతతో అల్లాడుతోంది. గతంలో మనవారే అయిన రాజనాల, రావుగోపాలరావు, జగ్గయ్య, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు.. ఇలా ఎందరో హీరోలతో పోటీ పడి మరీ విలన్లుగా రెచ్చిపోయారు. కానీ గత కొంతకాలంగా సరైన విలన్లు లేక మన పరిశ్రమ సోనూసూద్‌, ప్రకాష్‌రాజ్‌ తదితర పరభాషా నటులను విలన్లుగా తీసుకుంటున్నారు. అయితే స్వర్గీయ శ్రీహరి, సాయికుమార్‌, జగపతిబాబు, సుమన్‌, రాజశేఖర్‌ వంటివారు విలన్‌ రోల్స్ చేస్తుండటంతో కాస్త ఉపశమనం లభించింది. తాజాగా సుధీర్‌బాబు, తారకరత్న, ఆది పినిశెట్టి వంటి యంగ్‌ ఆర్టిస్టులు కూడా ప్రతినాయకుడి పాత్రలను చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి వీరి రాకతో అయినా మనకు ఉన్న విలన్ల కొరత తీరుతుందో లేదో చూడాలి...!