ఆర్య, నయనతార నటించిన 'రాజు రాణి' చిత్రం ఘనవిజయం సాధించడంతో తమిళంలో దర్శకుడు అట్లీ పేరు మారుమోగిపోయింది. 'పులి' వంటి డిజాస్టర్ తర్వాత స్టార్‌హీరో విజయ్ అట్లీని పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అదే 'తేరీ' చిత్రం. ఈ చిత్రం తమిళంలో వందకోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తెలుగులో 'పోలీస్'గా వచ్చిన ఈ చిత్రం ఇక్కడ మాత్రం పెద్దగా ప్రేక్షకలను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరోసారి అట్లీని పిలిచి అవకాశం ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ తమిళంలో భరత్ దర్శకత్వంలో తన 60వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే తాను చేయబోయే 61వ చిత్రానికి దర్శరత్వం వహించే అవకాశాన్ని విజయ్.. అట్లీకి ఇచ్చాడు. కాగా 'తేరీ' చిత్రం ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయిన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.