Advertisementt

అనుష్క 'భాగమతి' లో మలయాళీ హీరో!

Mon 09th May 2016 10:44 PM
anushka,bhagamathi,pilla jamindar ashok,jayaram,malayali hero  అనుష్క 'భాగమతి' లో మలయాళీ హీరో!
అనుష్క 'భాగమతి' లో మలయాళీ హీరో!
Advertisement
Ads by CJ

లేడీఓరియంటెడ్‌ చిత్రాలతో తన సత్తా చాటుతున్న స్వీటీ అనుష్క త్వరలో 'పిల్లజమీందార్‌' ఫేమ్‌ అశోక్‌ డైరెక్షన్‌లో 'భాగమతి' అనే చారిత్రక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం ఇటీవలే ముహూర్తం జరుపుకుంది. ఈ మూవీని యువి క్రియేషన్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో ప్రముఖ మలయాళీ హీరో జయరాం నటిస్తున్నాడు. ఈయన 'పంచతంత్రం, తెనాలి, తుపాకీ, ఉత్తమవిలన్‌' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ చిత్రాన్ని కూడా భారీ సాంకేతిక విలువలతో నిర్మించి దక్షిణాది భాషలన్నింటిలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ