తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ అజిత్. కాగా ఆయన గత కొన్నిచిత్రాలలో తన సొంత జుట్టు, గడ్డంతోనే నటిస్తూ, అందరూ ముద్దుగా పిలుచుకునే సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నెరసిన జుట్టు, గడ్డంతో ఆయన నటిస్తూ హీరో అంటే ఇలాగే ఉండాలి అనే పాత ధోరణికి చెక్ పెట్టాడు. తాజాగా బట్టతలతో కాకపోయిన తన వయసుకు తగ్గట్లుగా సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కబాలి'లో దర్శనిమిస్తున్నారు. కానీ ఇప్పటివరకు తమ టాలీవుడ్ స్టార్స్‌మాత్రం ఆ జోలికి వెళ్లడం లేదు. కాగా ప్రస్తుతం అలా కనిపించాలనే నిర్ణయానికి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఓకే చెప్పాడనే న్యూస్ ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్.. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రం అజిత్ నటించిన 'వీరమ్'లోని మెయిన్ పాయింట్‌ను తీసుకొని మిగతా భాగాన్నంతా పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఆకులశివ అద్భుతమైన స్టోరీని అందించాడని సమాచారం. 'వీరం' చిత్రంలోలాగానే ఈ చిత్రంలో పవన్ కూడా సగం నెరిసిపోయిన జుట్టు, గడ్డాలతో కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా 'వీరం' చిత్రం రీమేక్ విషయంలో పవన్‌కు నిర్మాత ఎ.యం. రత్నం ఎంతగానో సాయం చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరలో రత్నం నిర్మాణంలో పవన్ ఓ చిత్రంలో నటించేందుకు డేట్స్ ఇచ్చాడట. ఈ చిత్రం కూడా తమిళంలో రత్నం నిర్మాతగా అజిత్ హీరోగా తెరకెక్కిన 'వేదాలం' చిత్రం రీమేక్ అని సమాచారం. మొత్తానికి మరలా పవన్ రీమేక్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుండటం విశేషం.