సినిమాలతో కంటే ప్రకటనలతో ఎక్కు సంపాదించవచ్చని మన హీరోలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. తమ పాపులారిటీ ద్వారా పలు బ్రాండ్లకు అంబాసిడర్స్‌గా కూడా వారు సత్తా చూపుతున్నారు. ఇప్పుడిప్పుడే వారికి ఇందులోని వ్యాపార రహస్యం అర్థమవుతోంది. చిరంజీవి చేసిన థమ్సప్ యాడ్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను మహేష్ పీక్స్‌కి తీసుకెళ్లాడు. కేవలం యాడ్స్‌తోనే సరిపుచ్చకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించే దాకా ఈ ట్రెండ్‌ను తీసుకొచ్చింది మహేష్‌బాబే. ప్రస్తుతం తెలుగులో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఒప్పుకొని సినిమాల కంటే యాడ్స్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నాడు మహేష్‌బాబు. థమ్సప్, ఐడియాలతో పాటు దాదాపు 10 బ్రాండ్లకు మహేష్ అంబాసిడర్‌గా వ్యవహిరిస్తున్నాడు. ఈమధ్య మహేష్ నూతనంగా ఓ లోకల్ యాడ్‌లో దర్శకమిచ్చాడు. విజయవాడ కేంద్రంగా ఉన్న రామకృష్ణ వెనుజియా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు మహేష్ యాడ్ చేశాడు. కాగా ఈ యాడ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. మహేష్ వంటి సూపర్‌స్టార్ తమకు అంబాసిడర్‌గా పనిచేస్తున్నందున ఇక తమ దశ తిరిగినట్లే అని రామకృష్ణ వెనిజుయా సంస్థ అధినేతలు ఎంతో కాన్పిడెంట్‌గా ఉన్నారు. ఈ రకంగా చూస్తే మహేష్ ని మించిన హీరో మరొకరు లేరని ఒప్పుకోవాల్సిందే. ఇక ప్రస్తుతం మహేష్ నటించిన 'బ్రహ్మోత్సవం' మూవీ ఆడియో వేడుక ముగించుకుని మే 20న విడుదలకు ముస్తాబవుతుంది.