'పటాస్' చిత్రంతో తనలోని టాలెంట్ చూపించాడు దర్శకుడు అనిల్‌రావిపూడి. తాజా విడుదలైన 'సుప్రీమ్' రిజల్ట్ విషయాన్పి పక్కనపెడితే ఈ చిత్రంలో కూడా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపించి అందరినీ నవ్వించాడు. ఇక ఆయన తన మూడో చిత్రాన్ని ఎవరికి చేస్తాడు? అనే విషయంలో సందిగ్దం ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం అనిల్‌రావిపూడి తన మూడో చిత్రాన్ని మాస్‌మహారాజా రవితేజతో చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే రవితేజకు ఓ లైన్ చెప్పి ఒప్పించాడట అనిల్. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పనిలో పూర్తిగా బిజీగా ఉన్నాడు ఆయన. రవితేజ అంటేనే ఎనర్జీకి మారుపేరు. తన ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో మాస్ ఎంటర్‌టైనర్లను ఎంతో అలవోకగా చేస్తాడు రవితేజ. అలాంటి రవితేజకు అనిల్ రావిపూడి వంటి డైరెక్టర్ కలిస్తే ఇక థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇంతకు ముందు కూడా రవితేజ హరీష్‌శంకర్, పరుశురామ్, సంపత్‌నంది.. ఇలా చాలామంది కుర్ర దర్శకులతో చేశాడు. మరి రవితేజ నమ్మకాన్ని అనిల్ రావిపూడి ఎంతవరకు నిలబెడుతాడో వేచిచూడాల్సివుంది..!