మూడు విభిన్న పాత్రల్లో నటించిన సూర్య '24' చిత్రం అద్బుతమైన టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఓ మాస్టర్‌పీస్‌గా అందరూ అభివర్ణిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని రెండు పాత్రల కంటే సూర్య నటించిన విలన్ పాత్ర అయిన ఆత్రేయ క్యారెక్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ చిత్రం ద్వారా దాదాపు నాలుగేళ్లుగా ఇలాంటి హిట్ కోసం పరితపిస్తున్న సూర్యకి అలాంటి హిట్ లభించింది. కాగా ఈ చిత్రం విషయంలో ఓ తమిళ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందంటున్నారు తమిళ మీడియా వర్గాలు. తమిళంలో స్టార్ హీరోలే విలన్లుగా నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌ను సాధించాయని అంటున్నారు. 'రోబో' చిత్రంలో రజనీకాంత్ చిట్టి పాత్రలో విలన్‌గా అదరగొట్టాడు. ఈ చిత్రం రజనీ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక కమల్‌హాసన్ విలన్‌గా నటించిన 'దశావతారం' కూడా మంచి విజయాన్ని సాధించింది. అజిత్ హీరోగా, విలన్‌గా నటించిన 'వాలి' చిత్రం ఘనవిజయం సాధించడమే కాదు.. అజిత్ కెరీర్‌నే టర్న్ చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తమిళస్టార్ విజయ్ 'అజగీయ తమిళ మగన్' చిత్రంలో విలన్ పాత్రను కూడా తానే చేశాడు. విజయ్‌కి స్టార్‌హోదా రావడంతో ఈ చిత్రం కూడా కీలకపాత్ర పోషిచింది. తాజాగా ఇలాంటి సెంటిమెంటే సూర్యకు '24' చిత్రంలో కలిసి వచ్చిందని తమిళ మీడియా అంటోంది.