గత కొద్దికాలంగా స్మోకింగ్, డ్రింకింగ్ వార్నింగ్‌లు సినిమా థియేటర్లలో ప్రేక్షకులను విసిగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని తప్పించుకునే మార్గం మేకర్స్‌కు కనపడటం లేదు. గవర్నమెంట్ తప్పనిసరిగా అలాంటి సీన్స్ సినిమాలో ఉంటే తప్పకుండా అలాంటి వార్నింగ్‌లు వేయాల్సిందే అని రూల్ పెట్టింది. అయతే ఈ మాండటరీని తాజాగా వచ్చిన సూర్య 24 చిత్రం తప్పించుకుంది. ఈ సినిమాలో ఏ పాత్ర కూడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేసినట్లు దర్శకుడు ఎక్కడా చూపలేదు. ఆ అవసరం కథ రీత్యా ఎక్కడా కనపడలేదు. దాంతో స్క్రినింగ్‌కు తప్పనిసరిగా వేయాల్సిన యాడ్స్ నుంచి ఈ చిత్రం తప్పించుకోవడం సాధ్యమైంది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ విషయంలో అరుదైన రికార్డును సాధించింది. వీకెండ్‌లో ఈ చిత్రం ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్ల వసూళ్లు సాదించింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సినీ గెలాక్సీ ఇంక్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు, తమిళ వెర్షన్స్ కలుపుకొని ఈ సినిమా వీకెండ్ ముగిసేసరికి 1 మిలియన్ డాలర్ మార్క్‌ని అందుకుంది. తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది విశేషమని చెబుతున్నారు.