దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలతో జోడి కట్టిన మహేష్, సమంత కాంబినేషన్ ఎంత హిట్ అయ్యింది చెప్పక్కర్లేదు. సమంతా కూడా అదే చెబుతుంది. తామిద్దరి కాంబినేషన్ చాలా బావుంటుందనీ... సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కంటే బ్రహ్మోత్సవం ఇంకా బావుంటుందని ఒక టివి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. మహేష్ ఈ సినిమాలో చాలా బావుంటాడని.... ఈ సినిమాలో చాలా అందం గా కనిపించాడని చెప్పింది. ఆయనకి అమ్మాయిలు గుండెల్లో గుడి కట్టేస్తారని చెప్పింది. మహేష్ చాలా యనర్జిటిక్ గా ఉంటాడని చెప్పుకొచ్చింది. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా సినిమాని చాలా బాగా తీసారని చెప్పింది. ఈ సినిమాను ఆయన మాత్రమే తియ్యగలరని ఇంకా ఎవ్వరు ఇలా తియ్యలేరని చెప్పింది. ఈ సినిమా లో పెద్ద పెద్ద స్టార్స్ నటించారని వారు చాలా బాగా చేసారని చెప్పింది. తనకు బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ బాగా నచ్చిందని మిగతా పాటలు కూడా బాగా నచ్చాయని చెప్పింది సమంత.