రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు రెండు సీట్లు లభిస్తాయి. ఈ రెండు సీట్లలో దామోదరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావును ఎంపిక చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. కానీ మద్యలో నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ తనయ కవిత మరో ఎత్తుగడ వేసింది. ఆమె ఒక స్దానాన్ని కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి వచ్చిన సీనియర్ రాజకీయనాయకుడు డి.శ్రీనివాస్‌కు ఇవ్వాలని కవిత వ్యూహం రచించింది. డి.శ్రీనివాస్‌కు రాజ్యసభ సీటు ఇస్తే 32 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేతకు, అందునా ఓ బిసికి ఇచ్చిన గుర్తింపు వస్తుందని, తద్వారా ఆయనను ఢిల్లీలో ఉంచి పార్టీ ఆయన సలహాలను, ఆయన అనుభవాన్ని ఉపయోగించుకొన్నట్లు అవుతుందని కవిత చెబుతోంది. కానీ వాస్తవానికి డి.శ్రీనివాస్ కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతనే కావడంతో భవిష్యత్తులో ఆయన తనకు అడ్డంకిగా మారవచ్చని, ఆయను రాజ్యసభకు పంపిస్తే తనపై గౌరవంతో తనకు కూడా అండగా నిలబడి తనకు ఆ నియోజకవర్గంలో ఉన్న పట్టును తన గెలుపుకోసం ఉపయోగిస్తాడనేది కవిత వ్యూహం అని తెలుస్తోంది. దాంతో ఇక నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో తనకు తిరుగుండదనేది కవిత ఉద్దేశ్యం. కాగా ప్రస్తుతం డి.శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా ఉన్నాడు. ఈ కోణంలో కవిత చేస్తున్న ఆలోచన దృష్ట్యా కేసీఆర్ కూడా తమకున్న రెండు స్దానాల్లో ఒక స్థానాన్ని డి.శ్రీనివాస్‌కు కేటాయించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.