కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా తమ కెరీర్ ను సాగిస్తున్న అన్నదమ్ములు సూర్య, కార్తి తెలుగులో కూడా తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగు హీరోలకు సమానంగా ఇండస్ట్రీలో సూర్య క్రేజ్ సంపాదించుకున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. అన్న బాటలోనే తమ్ముడు కూడా తెలుగులో రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గా 'ఊపిరి' సినిమాలో నటించి అందరి మన్ననలు పొందాడు. అయితే వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు ఏ సినిమాలో నటించలేదు. వీరిద్దరిని తెరపై చూడాలనేదే అభిమానుల కోరిక. త్వరలోనే అభిమానుల కోరిక నేరవేరబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య ప్రస్తుతం 'సింగం 3' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సూర్యతో పాటు కార్తి కూడా కనిపించబోతున్నట్లు కోలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. అయితే కార్తి పాత్ర మాత్రం పూర్తి స్థాయిలో ఉండదు. కీలకమైన రెండు సన్నివేశాల్లో కనిపించడంతో పాటు ఒక పాటతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట కార్తి. ఇదే నిజమైతే సూర్య అభిమానులకు పండగే..