బిజెపి రాష్ట్ర ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజును వెంకయ్య నాయుడు తొక్కేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు సోము వీర్రాజు అనుచరులు. సోము వీర్రాజుకు రోజు రోజుకు ఫ్యాన్స్ పెరుగుతున్నారని వారు చెబుతున్నారు. దాంతో ఆయన అభివృద్దిని ఓర్చుకోలేని కొందరు సొంత పార్టీ నాయకులే ఆయనపై కుట్ర పన్నుతున్నారని తెలుస్తోంది. ఈమధ్య ఎక్కడ చూసిన బిజెపి కార్యకర్తల్లో తలలో నాలుకగా సోము వీర్రాజు పేరు వినిపిస్తోంది. ఇటీవల ఆయన రాజమండ్రిలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తే ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఆ సమావేశాలకు బిజెపి కార్యకర్తలు తండోతండాలుగా వచ్చారు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు. బిజెపి సమావేశానికి ఇంత మంది కార్యకర్తలా? అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. కానీ ఇటీవల బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సిద్దార్ద్‌నాద్ సింగ్ ఆ సభకు అయిన జమా పద్దులలెక్కలను చెప్పమని సోము వీర్రాజును గర్జించాడు. ఈ సమావేశం కోసం ఎంత డబ్బులు దండారు? అని ప్రశ్నించారు. దీంతో విస్తుపోవడం సోము వీర్రాజు వంతైందిట. ఈ పరిణామాన్ని సోముతో పాటు ఆయన అనుచరులు తట్టుకోలేకపోయారని, కేవలం ఆ సభకు కార్యకర్తలు స్వచ్చందంగా తరలివచ్చారని వారు వాపోతున్నారు. దీంతో సోము వీర్రాజు వెంటనే కల్పించుకొని కేంద్రమంత్రిగా ఉండి, ట్రస్ట్‌లు స్దాపించి ఎక్కడెక్కడి నుండో విరాళాలు సేకరిస్తున్న వారిని ఎక్కడ నుండి డబ్బులు వస్తున్నాయని ప్రశ్నించకుండా తనను మాత్రమే లెక్కలు చెప్పాలని కోరడం అన్యాయమని ఆయన ఇన్‌డైరెక్ట్‌గా వెంకయ్యనాయుడును టార్గెట్ చేశాడట...! మరి పార్టీలో మొదలైన ఈ ముసలం ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాల్సివుంది.