తెలంగాణలో ఇక టిడిపి పనైపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టిడిపి ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి మాటను టిడిపిలోని వారే పట్టించుకునే పరిస్థితులు లేవు. కాగా మే 27నుండి తిరుపతిలో టిడిపి మహానాడును నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మహానాడులో తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని వలసలను ప్రోత్సహిస్తున్న టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. కానీ అలాంటి తీర్మానం చేయడానికి ఏపీ టిడిపి నాయకులు ససేమిరా అంటున్నారు. ఏపీలో కూడా వైయస్సార్‌సీపీ నుండి టిడిపిలోకి వలస నేతలు వస్తున్న తరుణంలో అలాంటి తీర్మానం చేయడమంటే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుందని అంటున్నారు. అయినా కూడా రేవంత్‌రెడ్డి వెనక్కు తగ్గకుండా చంద్రబాబుతో ఈ తీర్మానంపై మాట్లాడుతానని బీష్మించుకుని కూర్చున్నాడని సమాచారం. ఏపీ నేతలు ఏమి చెప్పారో.. రేపు అదే నిర్ణయం చంద్రబాబు కూడా తీసుకుంటారని, ఈ సమయంలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అలాంటి తీర్మానం చేసే పరిస్థితులు లేవని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.