టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకానున్న సంగతి తెలిసిందే. కాగా అదే రోజున ఎన్టీఆర్ బర్త్‌డే. ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని ఆయన నటిస్తున్న తాజాచిత్రం జనతాగ్యారేజ్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా మే 20న మీడియాతో పాటు ప్రేక్షకులందరూ బ్రహ్మోత్సవం సందడిలో మునిగిపోయి ఉంటారు. మీడియలో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు, ఫస్ట్‌డే కలెక్షన్లు వంటి వాటితో బిజీగా ఉంటారు. దాంతో జనతాగ్యారేజ్ ను పట్టించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని భావించిన జనతాగ్యారేజ్ యూనిట్ తమ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ బర్త్‌డే ముందురోజు అంటే మే 19న సాయంత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ అండ్ టీం మంచి నిర్ణయమే తీసుకున్నది అంటున్నారు. మరి మొత్తానికి జనతాగ్యారేజ్ ఫస్ట్‌లుక్ ఎవరిని? ఎంతలా? అకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...!