Advertisementt

కేటీఆర్‌ చెప్పబోయే ఆ హ్యాపీ న్యూస్‌ ఏమిటి?

Wed 18th May 2016 04:27 PM
ktr,kcr,telangana government,ktr twit,nda government,bjp,trs  కేటీఆర్‌ చెప్పబోయే ఆ హ్యాపీ న్యూస్‌ ఏమిటి?
కేటీఆర్‌ చెప్పబోయే ఆ హ్యాపీ న్యూస్‌ ఏమిటి?
Advertisement
Ads by CJ

తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ తర్వాతి స్దానం కేటీఆర్‌దే. ఎప్పుడు సీరియస్‌గా ఉండే ఆయన ఓ ట్వీట్‌ చేస్తూ.. రేపు అంటే 19వ తేదీ ఓ పెద్ద సంతోషకరమైన విషయం జరుగనుంది.. అప్పటివరకు వెయిట్‌ చేయాలంతే..అని ట్వీట్‌ చేశాడు. కాగా నిన్న రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ గవర్నర్‌ని కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇక రేపు.. మొన్న జరిగిన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపధ్యంలో కేటీఆర్‌ చెప్పబోయే హాట్‌న్యూస్‌ ఏమిటి? అనేది అందరినీ ఉత్కంఠకు గురిచేస్తోంది. కాగా ఇటీవల కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి మోదీతో సమావేశం అయ్యారు. దీంతో త్వరలో టిఆర్‌ఎస్‌ ఎన్డీఏలో చేరనుందని, నిజమాబాద్‌ ఎంపీ, కేసీఆర్‌ తనయ కవితకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిని గమనిస్తే కేటీఆర్‌ చెప్పబోయే పెద్ద న్యూస్‌ ఏమిటి? ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారా? లేక ఎన్డీఏలో టిఆర్‌ఎస్‌ పార్టీ చేరనుందా? అనే ప్రశ్నలు అందరిలో మొలకెత్తుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ