విజయవాడలో టిడిపి ప్రాబల్యం పెరిగిపోతోంది. అక్కడ వైయస్సార్‌సీపీ మాయమైపోతోంది. దీంతో బాగా ఆలోచించిన జగన్ అక్కడ టిడిపిని ఎదుర్కోవాలంటే వంగవీటి రాధాకే సాద్యమని భావిస్తున్నాడు. ఇంతకాలం వైయస్సార్‌సీపీ యువజన విభాగానికి అధ్యక్షునిగా ఉన్న వంగవీటి రాధాకు తాజాగా విజయవాడ అధ్యక్ష బాధ్యతలను అప్పగించాడు. దీనివల్ల భవిష్యత్తులో తన పార్టీకి విజయవాడలో మంచి పట్టు వస్తుందనే ఉద్ధేశ్యంలో జగన్ ఉన్నాడు. ఇక జగన్ చేస్తున్న కర్నూల్ దీక్షలో ఆయన పార్టీ నాయకులు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై సెటైర్లు వేస్తున్నారు. తన కొడుకు లోకేష్‌ను చంద్రబాబు సూపర్‌స్టార్ కృష్ణలాగా మహేష్‌బాబును చేయాలని అనుకుంటే చివరకు సంపూర్ణేష్ బాబును కూడా చేయలేకపోతున్నాడని, మోహన్‌బాబులా తయారు చేద్దామనుకుంటే లోకేష్ బాబుమోహన్‌లాగా కూడా తయారుకావడం లేదని పొలిటికల్ స్పీచ్‌కు సినిమా సెటైర్లు జోడిస్తున్నారు. మొత్తానికి జగన్ దీక్ష సక్సెస్ అయిందా? లేదా? అనే విషయం కొన్నిరోజులాగితే కానీ తెలియదు.