నందమూరి నట వారసుడు ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు వేడుకను జరుపుకొంటున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'జనతా గ్యారేజ్' సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకరికొకరు ఈ లుక్ ను షేర్ చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీకు చెందిన పెద్దలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో హీరోలు ఒకరికొకరు సన్నిహితంగానే ఉంటారు. ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' సినిమా ట్రైలర్ బావుందని, అలానే రీసెంట్ గా ఎన్టీఆర్ డాన్సులంటే తనకిష్టమని మహేష్ బహిరంగంగానే చెప్పాడు. ఈ విషయాలు తెలిసిన ఎన్టీఆర్ చాలా సంతోషపడ్డాడు. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'హ్యాపీ బర్త్ డే తారక్. ఈరోజు.. అలానే ఈ సంవత్సరం నీకు బావుండాలని కోరుకుంటున్నాను. నీ సినిమా ఫస్ట్ లుక్ అదిరింది' అని ట్వీట్ చేశాడు. తన తోటి హీరో ఇలా ట్వీట్ చేయడంతో తారక్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడట.