యాపిల్ సిఈఓ హైదరాబాద్ రావడం నిజంగా శుభవార్తే. భవిషత్తులో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగంలో అగ్రగామిగా ఉండడానికి ఇది మరొక ముందడుగు. యాపిల్ సిఈఓ కేవలం కొద్ది గంటలు మాత్రమే గడిపినప్పటికీ విద్యార్థులకు, ప్రభుత్వానికి ఉత్సాహాన్నిచ్చారు. ఇక సిఈఓ రావడం పోవడం మొత్తం సీన్ లో కేవలం కేసీఆర్,కేటీఆర్ మాత్రమే హైలెట్ అయ్యారు. అంటే క్రెడిట్ మొత్తం వారి ఎకౌంట్ లోనే వేసుకోవడానికి ప్రయత్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కావడం వల్ల వారిద్దరే కనిపించారని అనుకోవచ్చు. కానీ ఎవరైనా వి.ఐ.పి. వస్తే వారి పర్యటనలో ఇతర మంత్రులను కూడా భాగస్వాములను చేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కే చెందిన లోకల్ మంత్రులు శ్రీనివాసయాదవ్, నాయని నరసింహారెడ్డి, పద్మారావు వంటి వారు కూడా పర్యటనలో కనిపించలేదు.
భవిష్యత్తు లో మారే రాజకీయ ముఖచిత్రంలో కేటీఆర్ ను హైలెట్ గా చూపడానికి ప్రతి సందర్భాన్ని కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లో కేటీఆర్ నే బాధ్యుడిని చేశారు. ఆ వ్యూహంలో భాగంగానే యాపిల్ సిఈఓ పర్యటనలో కేటీఆర్ హైలెట్ అయ్యాలా జాగ్రత్త తీసుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.