ఒక సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే... తెలుగు స్టార్ హీరోల బర్త్‌డేలు హంగామాగా జరిగేవి. ఆ రోజున అభిమానుల హంగామా ఉండేది. వారి సమక్షంలోనే బర్త్‌డే కేక్ కట్ చేసేవారు. ముందురోజే మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్యూలు ఇచ్చేవారు. హీరోల పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజున్నమాట. అందుకే ఎక్కడెక్కడి నుండి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేసుకుని మరీ వచ్చి హీరోకు శుభాకాంక్షలు తెలిపేవారు.
ఫ్లాష్ బ్యాక్ నుండి బయటకు వస్తే... ఇప్పుడు స్టార్ హీరోల బర్త్‌డే హడావుడి తగ్గింది. మీడియాకు అసలు ఇంటర్యూలే ఇవ్వడం లేదు. పైగా బర్త్‌డే రోజున అభిమానులకు దొరకడం లేదు. చడిచప్పుడు లేకుండా కుటుంబసభ్యుల మధ్య జరుపుకుంటున్నారు. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ వంటి హీరోల బర్త్‌డేలు ఇటీవలే వచ్చాయి. కానీ ఎలాంటి హడావుడి మాత్రం కనిపించలేదు. బర్త్‌డే రోజున షూటింగ్ ఉన్నప్పటికీ సెట్లో జరుపుకోవడం లేదు. ఆ రోజు విరామం తీసుకుని కుటుంబంతోనే గడుపుతున్నారు.
అయితే బర్త్‌డే రోజున తమ నిర్మాతలతో, అభిమానులతో చెప్పి పత్రికల్లో ప్రత్యేకంగా ప్రకటనలు వేయించుకునే కార్యక్రమం మాత్రం కొనసాగుతోంది. ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుంది?