త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో టిడిపికి మూడు సీట్లు దక్కనున్నాయి. ఒక సీటు వైయస్సార్‌సీపీకి దక్కనుంది. ఈ మూడు సీట్లలోనూ టిడీపీనే పోటీ చేయాలని, బిజెపికి ఒక సీటు ఇవ్వాల్సిన అవపరం లేదని టిడిపి నాయకుల నుంచి చంద్రబాబుకు ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యేకహోదా ఇవ్వకుండా, చివరకు తమనే టార్గెట్ చేస్తోన్న బిజెపికి ఈ విషయంలో సహకరించడానికి వీలు లేదనే వాదన టిడిపిలో గట్టిగా వినిపిస్తోంది. కానీ రాష్ట్రంలో ఎలా ఉన్నా, కేంద్రంలో మాత్రం చంద్రబాబు, మోడీల మధ్య ఇంకా మంచి అనుబంధమే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిత్రపక్షమైన బిజెపికి ఒక సీటు ఇవ్వడానికే చంద్రబాబు సుముఖంగా ఉన్నాడట. ఆ ఒక్క సీటును కేంద్రమంత్రి అయిన నిర్మాలాసీతారామన్‌కు ఇచ్చేందుకు ఇప్పటికే బాబు ముందుకు రిక్వెస్ట్ వచ్చిందని, ఆమె కోసం ఓ సీటును బిజెపి అధిష్టానం నోరు విప్పి అడగనప్పటికీ వారికే కేటాయించి తమ ఉదారత చాటుకోవాలని, తద్వారా కేంద్రంలో తన పట్టును మరింత పెంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నాడట. ఈ దిశగా చూసుకుంటే ఏపీ నుండి మరోసారి కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ రాజ్యసభకు ఎన్నికకావడం లాంఛనమే అని తెలుస్తోంది.