తెలంగాణ రాష్ట్రావతరణ రోజు(జూన్ 2)న నితిన్ నటించిన 'అ ఆ' ప్రేక్షకుల ముందుకువస్తోంది. నితిన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరో కాబట్టే అదే రోజునే 'అ ఆ' రిలీజ్ ప్లాన్ చేశారనుకోవచ్చా లేక మరో కారణం ఉందా. అ ఆ నిర్మాత, దర్శకులు ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే కాబట్టి వారికి ఆ ఉద్దేశం ఉండి ఉండదు. నితిన్ కూడా అలాంటి కోరిక కోరే అవకాశం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాలోకి ఆయనను హీరోగా తీసుకోవడమే చిత్రమైన విషయం.
సహజంగా కొత్త సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. వీకెండ్ లో రిలీజ్ చేయడం మొదటినుండి ఆనవాయితి. అయితే ఈసారి జూన్ 2 గురువారం వస్తోంది. ఆ రోజున తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర ఏర్పాటు సంబురాలు చేస్తోంది. అందుకుగాను సెలవుగా ప్రకటించింది. ఈ కారణం చేతనే 'అ ఆ' చిత్రాన్ని గురువారం రిలీజ్ చేస్తున్నారని చిత్ర సంబంధికులు అంటున్నారు. దీనివల్ల గురు, శుక్ర, శని, ఆది వరుసగా నాలుగు రోజులు కలిసివస్తుందన్నమాట.