Advertisementt

బట్టలు దొంగతనం చేసిన హీరో!

Wed 25th May 2016 04:48 PM
rithesh deshmukh,house full 3 movie,true blue  బట్టలు దొంగతనం చేసిన హీరో!
బట్టలు దొంగతనం చేసిన హీరో!
Advertisement
Ads by CJ

తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకొని సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ హీరోను పెళ్ళాడింది మన హీరోయిన్ జెనీలియా. అతడే రితేష్ దేశ్ముఖ్. అయితే రితేష్ ఒక బట్టల షాప్ లో దొంగతనం చేస్తూ.. సీసీ టీవీకి చిక్కాడు. ట్రూ బ్లూ అనే బ్రాండ్ కు చెందిన బట్టలను రితేష్ నిన్న దొంగతనం చేశాడు. తను దొంగతనం చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది. నిజంగానే రితేష్ దొంగతనం చేసాడా..? అని అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఒకరికొకరు షేర్ చేసుకొని మరీ చూస్తున్నారు. ఈ వీడియోలో రితేష్ కొన్ని షర్ట్స్ ను ట్రై చేసి మరికొన్ని టీ షర్ట్స్ ను తను వేసుకున్న షర్ట్ లో దోపెసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసిన రితేష్ అభిమానులతో పాటు కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా షాక్ అవుతున్నారు. రితేష్ కు దొంగతనం చేయాల్సిన అవసరం లేదని, ఇది తను నటిస్తోన్న 'హౌస్‌ఫుల్‌ 3' సినిమా ప్రమోషన్ కోసమని కొందరి భావిస్తున్నారు. అయితే రితేష్ ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ