సినిమా కోసం ఎంత కష్టపడ్డవారినైనా చూసుంటాం. మాంసాహారులు శాకాహారులుగా మారిపోవడం రీసెంట్‌గా చూస్తున్నాం. బాలీవుడ్‌లో యమా జోరుగా సాగుతున్న ఈ ట్రెండ్ ఇప్పడు టాలీవుడ్‌కు కూడా వచ్చేసింది. 'ధ్రువ' కోసం రామ్‌చరణ్ శాకాహారిగా మారిపోయాడు. ఆకు కూరలు, కూరగాయలు తింటూ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. అన్నట్టు... ఈ సినిమా పేరు 'ధ్రువ' అని ఆనోటా ఈనోటా వినడమే కానీ సినిమాకు సంబంధించిన వారెవరూ చెప్పలేదు. తొలిసారిగా రామ్‌చరణ్ ఈ మాట చెప్పాడు. ఫేస్‌బుక్‌లో ఈ శాకాహారం విషయం రాస్తూ 'ధ్రువ' కోసమే ఇదంతా అని రాశాడు. దీంతో సినిమాకు నామకరణం జరిగిపోయినట్టే. ఈ సినిమాలో రామ్‌చరణ్ పోలీసు ట్రైనింగ్ తీసుకుంటున్న యువకుడిగా, పోలీసుగా కనిపించనున్నాడు. పోలీసు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. అందుకే సినిమాలో సరికొత్తగా కనిపించడానికి రామ్‌చరణ్ శరీరాన్ని మలుచుకుంటున్నాడు. అందుకే ఈ శాకాహార మంత్రం. 'గోవిందుడు అందరివాడేలే', 'బ్రూస్‌లీ' పరాజయాలతో ట్రాక్ తప్పిన చెర్రీని ఇదైనా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.