Advertisementt

అల్లు అరవింద్‌ కి ఆప్షన్ A లేదంటే S..!

Sat 28th May 2016 08:13 PM
allu aravind,allu arjun,allu sirish,srikanth addala,srikanth addala movie in geetha arts,brahmotsavam  అల్లు అరవింద్‌ కి ఆప్షన్ A లేదంటే S..!
అల్లు అరవింద్‌ కి ఆప్షన్ A లేదంటే S..!
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్‌ది మాస్టర్‌ బ్రెయిన్‌. ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో? ఎప్పుడు ఎవరిని పక్కనపెట్టాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలీదు. అందుకే ఆయన ఓ సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ గా, సక్సెస్‌ఫుల్‌ ఫాదర్‌గా నిలబడ్డాడు. ప్రస్తుతం ఆయన తన కుమారుడు అల్లుఅర్జున్‌ని హీరోగా తిరుగులేని స్దానంలో నిలబెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బన్నీ విషయానికి వస్తే మాస్‌, యూత్‌ ఆడియన్స్‌పరంగా ఇప్పటికే సుస్ధిరస్ధానం సంపాదించాడు. ఇక 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యాడు. ఇంకా ఇంకా బన్నీని ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవ్వడం కోసం అరవింద్‌ వ్యూహాలు రచిస్తున్నాడు. అందులో భాగంగా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలతో ఓ చిత్రం చేయడానికి ఆయన శ్రీకాంత్‌కు అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. ఇదంతా 'బ్రహ్మోత్సవం' విడుదలకు ముందు పరిస్థితి.

'బ్రహ్మోత్సవం' భారీ డిజాస్టర్‌ కావడంతో పాటు ఈ చిత్రం డిజాస్టర్‌కు దర్శకునిదే ఎక్కువ బాధ్యత అని టాక్‌ మొదలైంది. పక్కా స్క్రిప్ట్‌ లేకపోవడం దర్శకుని తప్పిదంగా చెబుతున్నారు. దీంతో అల్లుఅరవింద్‌ శ్రీకాంత్‌ అడ్డాలను పక్కన పెట్టేస్తాడా? ఇచ్చిన అడ్వాన్స్‌ పోతేపోనీ అని వదిలేస్తాడా? అనే చర్చ సాగుతోంది. కానీ అరవింద్‌ మాత్రం శ్రీకాంత్‌తో సినిమా చేయడానికే రెడీ అయ్యాడంటున్నారు. పక్కా స్క్రిప్ట్‌ లేకపోవడం, శ్రీకాంత్‌ తాను అనుకున్నది స్పాట్‌లో తీస్తానంటే చూస్తుండటానికి తానేం పిల్లాడిని కాదని, ముందుగా స్టొరీ తన చేతిలోనే ఉంటేనే సెట్ కి వెళ్ళడం జరుగుతుంది అనే ధీమాతో అరవింద్ ఉన్నాడట. అందునా ఓ డిజాస్టర్‌తో కసి మీద ఉన్నాడు కాబట్టి మరింత కసితో పనిచేస్తాడని శ్రీకాంత్ పై నమ్మకం వ్యక్తం చేస్తున్నాడట  అల్లు అరవింద్‌.  అప్పటికీ ఆ స్క్రిప్ట్‌ తనకు నచ్చకపోతే అర్జున్(A) స్ధానంలో శిరీష్‌ (S)ను ఎంటర్‌ చేయాలనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ