Advertisementt

ప్రభాస్‌ అయినా ఆ లోటును తీరుస్తాడా?

Sun 29th May 2016 06:29 PM
prabhas,bahubali,bahubali 2,run raja run fame,sujit,bollywood success  ప్రభాస్‌ అయినా ఆ లోటును తీరుస్తాడా?
ప్రభాస్‌ అయినా ఆ లోటును తీరుస్తాడా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్స్‌ అందరూ తెలుగుతో పాటు మలయాళ, తమిళ రంగాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ది సపరేట్‌ స్టైల్‌. రాజమౌళి 'బాహుబలి' పుణ్యమా అని ఆయన నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. నేడు ప్రభాస్‌కు ఇండియాతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా ఎంతో గుర్తింపు వచ్చింది.ఇక రాబోయే 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' కూడా ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే అందరూ డిసైడ్‌ అయిపోయారు. దీంతో తనకు లభించే ఇమేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రభాస్‌ డిసైడ్‌ అయ్యాడు. 'బాహుబలి2' తర్వాత తాను 'రన్‌రాజారన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌ బేనర్‌పై ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రభాస్‌ మొదటిసారిగా పూర్తిస్ధాయి పోలీస్‌ ఆఫీసర్‌పాత్రను చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ఆయన తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో చేయాలని డిసైడ్‌ అయ్యాడు. దీనికి సంబంధించి పలు ప్రొడక్షన్‌ సంస్థలతో యువి అధినేతలు చర్చలు జరుపుతున్నారని సమాచారం. మన తెలుగు హీరోలు, మరీ ముఖ్యంగా దక్షిణాది హీరోయిన్లు తప్పితే, తెలుగు, దక్షిణాధి హీరోలు బాలీవుడ్ లో సక్సెస్‌ అయిన దాఖలాలు తక్కువే. కమల్‌, రజనీ కూడా అక్కడ పూర్తి స్ధాయిలో సక్సెస్‌ కాలేకపోయారు. టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌కి వెళ్లిన చిరంజీవి, రామ్‌చరణ్‌, తాజాగా పవన్‌కళ్యాణ్‌లు అక్కడ సక్సెస్‌ కాలేదు. మరి ఆ లోటును ప్రభాస్‌ తీరుస్తాడో లేదో వేచిచూడాల్సి ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ