ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కాగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'కత్తి' రీమేక్. ఈ రెండు చిత్రాలలోనూ హీరోయిన్‌గా నటించే అవకాశం నయనతారకు వచ్చింది. కానీ ఇప్పటికే ఆమె ఐదు తమిళ చిత్రాలతో పాటు వెంకటేష్‌తో కలిసి 'బాబు బంగారం' చిత్రం చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక నయన నానా ఇబ్బందులు పడుతోంది. దీంతో ఈ చిత్రం కూడా లేటవుతూ వస్తోంది. ఈ సమయంలో చిరు, బాలయ్యల చిత్రాలను ఒప్పుకొని వారిని ఇబ్బంది పెట్టడం కంటే చేయనని చెప్పడమే మేలని భావించిందట. సాధారణంగా హీరోయిన్లు చిరు, బాలయ్యల సరసన అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారు. అందునా అవి 100, 150 వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు కావడంతో ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది, అయినా కూడా నయన నో చెప్పిదంటే ఆమె సమస్యను అర్ధం చేసుకోవచ్చు. అయినా ఈ చిత్రాలు మిస్ అయినందుకు తనకు పెద్దగా బాదేమీ లేదంటోంది నయనతార..!