తన పదేళ్ల కెరీర్‌లో హీరో రామ్ ఏ డైరెక్టర్‌తోనూ రెండోసారి కలిసి పనిచేయలేదు. తనకు హిట్టిచ్చిన డైరెక్టర్లతో పాటు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లతో కూడా రెండోసారి జత కట్టలేదు. తాజాగా ఆయన రూటు మార్చినట్లు స్పష్టంగా అర్ధమవుతూ ఉంది. ప్రస్తుతం ఆయన సంతోష్ శ్రీనివాస్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆయన గతంలో రామ్‌కు కందిరీగ వంటి సూపర్‌హిట్‌ను అందించాడు. నేను.. శైలజాతో ఈ ఏడాది తనకు హిట్టిచ్చిన కిషోర్ తిరుమలశెట్టితో రెండో చిత్రం చేయడానికి కూడా ఆయన కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్‌తో గతంలో రామ్ ఎందుకంటే... ప్రేమంట చిత్రం చేశాడు. కానీ ఆ చిత్రం ఫ్లాప్ అయింది. తాజాగా కరుణాకరన్‌తో మరలా ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్. ఈ చిత్రంతో కరుణాకరన్ తనకు పెద్ద హిట్ ఇస్తాడనే నమ్మకంతో రామ్ ఉన్నాడు. మొత్తానికి రామ్‌లో నేను.. శైలజ తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన ఏజ్‌కు తగ్గ పాత్రలు చేయకుండా మద్యలో మాస్ సినిమాల వెంటపడి తన కెరీర్‌కే ముప్పు వాటిల్లేలా చేసుకున్న ఆయన ప్రస్తుతం చేయనున్న చిత్రాలు వినూత్న ప్రేమకథలే అని తెలుస్తోంది.