తెలుగు అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలుగొందిన కాజల్ కు ప్రస్తుతం తెలుగులో ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. తమిళంలో కూడా తను నటించిన సినిమాలు అంతంతమాత్రంగా రన్ అవుతుండడంతో అక్కడ కూడా తనకు ఛాన్సులు రావడం కష్టమని భావించారు. రీసెంట్ గా తను నటించిన రెండు భారీ ప్రాజెక్ట్స్ డిజాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడు పనైపోయిందనుకున్నారంతా.. ఇక కాజల్ కు సినిమా అవకాశాలు వచ్చే చాన్సే లేదని రకరకాలుగా వార్తలను ప్రచురించారు. అయితే ఈ వార్తలు కానీ, సినిమా ఫ్లాప్స్ కానీ కాజల్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించే అవకాశం కాజల్ ను వెతుక్కుంటూ వచ్చింది. అజిత్, శివ కాంబినేషన్ లో వీరమ్, వేదాళం వంటి హిట్ సినిమాలు వచ్చాయి. మరోసారి వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉంది. అందులో ఒకరు అనుష్క కాగా మరొకరు కాజల్. జూలైలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా.. కాజల్ కు కలిసొస్తుందేమో చూడాలి..!