వేణుమాధవ్... ఇతను కామెడీకి పెట్టింది పేరు. కానీ ఈ మధ్య వేణుమాధవ్ కు సరైన అవకాశాలు రావడం లేదు. అవకాశాల కోసం ప్రయత్నం చేయవచ్చు కదా...! అంటే నో అంటున్నాడు. తానెవ్వరినీ వేషాలు ఇవ్వమని అడిగే ప్రశ్నే లేదంటున్నాడు. హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రాలు ఆయన కెరీర్ను దెబ్బతీశాయి. అయినా సరే వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి', చిరంజీవి 150వ చిత్రం 'కత్తిలాంటోడు', పవన్కళ్యాణ్ -ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందే చిత్రం.. ఇలా పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో కమెడియన్గా కనిపించనున్నాడు. తనకు ఇటీవలి కాలంలో బూతు, ద్వందార్దల డైలాగులతో కూడిన వేషాలు వస్తున్నాయని, కానీ తాను వాటిని ఒప్పుకోవడం లేదంటూ సెలవిచ్చాడు. మరి ఈ మూడు ప్రతిష్టాత్మక చిత్రాలలో ఛాన్స్ కొట్టేసిన ఈ కమెడియన్ మరలా బిజీ అవుతాడో లేదో వేచిచూడాల్సివుంది..!