Advertisementt

నాగశౌర్యకు ఇగో ప్రాబ్లమ్స్‌..!

Tue 31st May 2016 02:58 PM
naga shourya,mega daughter,niharika,oka manasu movie,ego problems  నాగశౌర్యకు ఇగో ప్రాబ్లమ్స్‌..!
నాగశౌర్యకు ఇగో ప్రాబ్లమ్స్‌..!
Advertisement
Ads by CJ

లవర్‌బోయ్‌ ఇమేజ్‌ కోసం తపన పడుతున్న హీరో నాగశౌర్య ప్రస్తుతం మెగా డాటర్‌ నిహారిక హీరోయిన్‌గా నటిస్తున్న తొలిచిత్రం 'ఒక మనసు'లో హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రం తన కెరీర్‌కు మంచి టర్నింగ్‌ ఇస్తుందని నాగశౌర్య ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. కానీ ఈ చిత్రం పేరు చెబితే చాలు అందరూ నిహారిక పేరు చెబుతున్నారు. ఆడియో వేడుకలో కూడా నాగశౌర్యను పట్టించుకున్న వారు లేరు. ప్రమోషన్‌ విషయంలో కూడా నిర్మాతలు హీరో కంటే హీరోయిన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నాగశౌర్య కక్కలేక మింగలేక కృంగిపోతున్నాడట. ఇటీవల ఓ గేమ్‌ షోకు రమ్మని ఓ చానెల్‌ వారు పిలిస్తే.. నేను సింగిల్‌గా అయితే వస్తాను.. అంతేగానీ హీరోయిన్‌తో కలిసి మాత్రం రానని ఖరాఖండిగా చెప్పేశాడట. ఇక రెమ్యూనరేషన్‌ విషయంలో కూడా నిహారికకే ఎక్కువ మొత్తం ఇచ్చారట. మెగా ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రానికి గాను నిహారికకు ఏకంగా 60లక్షలు ఇచ్చారని, నాగశౌర్యకు మాత్రం 50లక్షలు ఇచ్చారని సమాచారం.దాంతో పాపం.. నాగశౌర్యకు ఇగో ప్రాబ్లమ్స్‌ వచ్చాయని అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ