వాస్తవానికి రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబు కూడా ఓటుకు నోటు విషయంలో తప్పు చేశాడని భావించిన జగన్.. ఈ విషయంలో కేసీఆర్‌తో పాటు కేంద్రంలోని టిడిపికి వ్యతిరేకులైన కేంద్రమంత్రులు చంద్రబాబును ఇరుకున పెడతారని జగన్ ఆశపడ్డాడు. కానీ ఈ కేసు జరిగిన ఏడాది అయింది. కానీ మొదట్లో ఈ విషయంపై కేసీఆర్, చంద్రబాబుల మద్య వాడివేడి, ఘాటైన కామెంట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చంద్రబాబు కూడా ఫోన్‌ట్యాంపరింగ్ కేసు విషయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం ఉండటంతో ఇద్దరు ముఖ్యమంత్రులు సైలెంట్ అయిపోయారు. ఈ విషయంలో కేసీఆర్ కూడా ఓ అడుగు వెనక్కు వేశాడు. కానీ జగన్ మీడియా పత్రిక, చానెల్, కేసీఆర్ అనుకూల మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో ఫోన్ ట్యాంపరింగ్ కంటే ఓటుకు నోటు కేసే పెద్దదని విశ్లేషణలు ఇస్తున్నప్పటికీ వాస్తవానికి న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫోన్‌ట్యాంపరింగ్ కేసే పెద్దది అని తెలుస్తోంది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోవడం లేదు. ఈ వివాదం నుండి లబ్దిపొందాలని భావించిన జగన్ వర్గంకు నిరాశ ఎదురైంది.