Advertisementt

మారుతికి మరో మెగాహీరో ఛాన్స్!

Thu 02nd Jun 2016 01:37 PM
maruthi,kothajanta,sai dharam tej,maruthi directs sai dharam tej,babu bangaram  మారుతికి మరో మెగాహీరో ఛాన్స్!
మారుతికి మరో మెగాహీరో ఛాన్స్!
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్‌'తో దర్శకుడు మారుతి స్టార్‌ డైరెక్టర్ల సరసన చోటు సంపాదించాడు. ఆయన ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌-నయనతార జంటగా 'బాబు బంగారం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం టీజర్‌ను ఈనెల 6వ తేదీన విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఆడియోను కూడా ఇదే నెలలో జరిపి, సినిమాను జులై 1న గానీ 7వ తేదీన గానీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా త్వరలో మారుతి మెగా మేనల్లుడు 'సుప్రీం' హీరో సాయిధరమ్‌తేజ్‌తో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ స్టోరీని సాయికి మారుతి వినిపించాడని, సాయి నుండి కూడా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా సాయి ప్రస్తుతం సునీల్‌రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' చిత్రం చేస్తున్నాడు. ఆయన హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కూడా జరుపుకుంది. కానీ ఈ చిత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దీంతో ఆ సినిమా స్దానంలో సాయి.. మారుతి డైరెక్షన్‌లో ఈ సినిమా చేయనున్నాడని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ