బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ప్రదాని మోడీలు తమ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కావాలని కోరిన తర్వాతనే తాము కేంద్ర రైల్వే శాఖామంత్రి సురేష్‌ప్రభుకు ఇచ్చామని లోకేష్‌తో సహా పలువురు టిడిపి నాయకులు చెబుతున్నారు. కానీ దగ్గుబాటి పురందరేశ్వరి మాత్రం తమ నాయకులు చంద్రబాబును రాజ్యసభ సీటు అడగలేదని, బాబే ఇచ్చాడని అంటోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు చెబుతున్నది నిజం? ఎవరు చెబుతున్నది అబద్దం? అనేది అర్థంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి బిజెపి నుండి స్పందన రాకుండా ఉంటే టిడిపినే మూడో సీటుకు కూడా పోటీ చేసేది. రాజ్యసభ సీటు వంటి ప్రతిష్టాత్మక పదవిని బిజెపి అడగకుండా చంద్రబాబే ఎందుకు ఇస్తాడు? అనేది అందరిలో తలెత్తుతున్న సందేహం. కాగా బిజెపి అధిష్టానం కోరకపోతే మహారాష్ట్రకు చెందిన సురేష్‌ప్రభుకు స్ధానం ఎలా దక్కింది? బిజెపి వారు సూచించనిదే చంద్రబాబు.. సురేష్ ప్రభుకే ఎందుకు చోటిచ్చారు? ఆయన అనుకుంటే వెంకయ్యనాయుడు, లేదా నిర్మాలా సీతారామన్‌లలో ఒకరికి ఇచ్చి ఉండేవాడు కదా! ఇలా పురందశ్వేరి వ్యాఖ్యలపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.