రాష్ట్రం ఆవిర్భవించి రెండు సంవత్సరాలైన సందర్భంగా తెలంగాణ పది జిల్లాలు దూం ధాం అంటూ సంబరాలు చేసుకున్నాయి. నగరాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోయాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు 30 లక్షల చొప్పున కేటాయించింది ఇక జూన్ 2వ తేదీన తెలుగు, ఇంగ్లీషు పత్రికలకు కేసీఆర్ బొమ్మతో ప్రకటనలు గుప్పించారు. గతంలో ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి బొమ్మలు వాడకూడదనే నిబంధన ఉండేది. ఇప్పుడది తీసి వేయడంతో పత్రికల పంటపండింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం పత్రికలు ఇచ్చిన ప్రకటన వ్యయం అక్షరాల 80 కోట్లట. ఒక్కో పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు ఇలా ఉంది (రూ.కోట్లలో) ఈనాడు 7, సాక్షి 6, ఆంధ్రజ్యోతి 12, నమస్తే తెలంగాణ 12, వార్త, అంధ్రప్రభ, నవతెలంగాణ, మన తెలంగాణ, సూర్య, ప్రజాశక్తి వంటి పత్రికలకు 2 కోట్లు చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. కేసీఆర్ ఘనత ఉత్తర భారతానికి కూడా తెలియడం కోసం ఆంగ్రపత్రికలకు సైతం ప్రకటనలు ఇచ్చారు. వీటి ప్రకటనల ఖర్చు (రూ. కోట్లలో) టైమ్స్ ఆఫ్ ఇండియా 11, ది హిందు 6, ఇండియన్ ఎక్స్ ప్రెస్ 2 కోట్లు ఖర్చు పెట్టారని తెలిసింది.ఇంకా చిన్నా చితక పేపర్లు, టీవీ ఛానల్స్ కు కూడా ప్రకటనలు రిలీజే చేశారు. మొత్తం కలుపుకుంటూ 80 కోట్లుగా తేలింది. ఇక తెలుగు దిన పత్రకల్లో ఇచ్చిన ప్రకటనలు కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే విధంగా ప్లాన్ చేశారు.
ఇంత ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోవడం అవసరమా అనే డౌట్ చాలామందికి వస్తుంది.అయితే వరుస ఉప ఎన్నికల్లో తెరాస గెలవడం, ఒక సర్వేలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ప్రధమ స్థానం దక్కడం వంటి పలు కారణాల వల్ల ఆయన ఖ్యాతి దేశమంతటా తెలియడం కోసమే ప్రచారం కోసం భారీ వ్యయం చేశారని సమాచారం.