ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటించే హీరో.. రవితేజ. కానీ ఆయన తన 'బెంగాల్‌టైగర్' చిత్రం తర్వాత ఇప్పటివరకు తన తదుపరి చిత్రంపై నోరు విప్పలేదు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో ఆయన 'రాబిన్‌హుడ్' అనే చిత్రం చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ ఈ చిత్రంపై ఇప్పటివరకు ఎవ్వరూ అఫీషియల్‌గా నోరు విప్పలేదు. కాగా ఆ మధ్య రవితేజ హీరోగా బాలీవుడ్‌లో హిట్టయిన 'స్పెషల్ చబ్బీస్' చిత్రం చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని వార్తలు వచ్చినా కూడా ఆయన ఆ విషయంలో కూడా నోరు విప్పలేదు. తాజాగా రవితేజ మరో బాలీవుడ్ చిత్రం రీమేక్‌పై కన్నేశాడని అంటున్నారు. మూడేళ్ల క్రితం హిందీలో వచ్చిన 'జాలీ ఎల్.ఎల్.బి' చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. ఇదే చిత్రాన్ని తమిళంలో 'మణిథన్' పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి రవితేజ ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు. అదే నిజమైతే తొలిసారిగా లాయర్ పాత్రలో ఈ మాస్ మహారాజా రెచ్చిపోవడం ఖాయం అంటున్నారు.