వాస్తవానికి తమకు ఉన్న సంఖ్యాబలం వల్ల రాజ్యసభ సీట్లలో ఒక సీటు వైయస్సార్‌సీపీకి దక్కడం ఖాయం అయింది. అయితే చంద్రబాబు నాయుడు నాలుగో అభ్యర్ధిని కూడా పోటీ పెట్టి విజయం సాధిస్తే.. చంద్రబాబు తీరును దేశవ్యాప్తంగా ఎండగట్టి ఉత్తరాఖండ్ తరహాలో కోర్టుకి వెళ్లడానికి జగన్ ప్లాన్ చేసి తనకు ప్రజల్లో సింపతీ వచ్చేలా గేమ్ ప్లాన్ చేశాడు. పోనీ నాలుగో అభ్యర్థిగా జగన్ అభ్యర్థి అయిన విజయసాయిరెడ్డి గెలిచినా కూడా నాలుగో అభ్యర్థిని పోటీకి దింపి చంద్రబాబు నవ్వుల పాలవుతాడని ఆయన ఆలోచన చేశాడు. కానీ జగన్ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన బాబు నాలుగో అభ్యర్ధిని పోటీకి దించకుండా తన స్టైల్‌లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో జగన్ వ్యూహం ఫెయిలయిందని చెప్పవచ్చు. ఇక జగన్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి క్యాంపు రాజకీయాలు చేశాడు. తన ఎమ్మెల్యేలను టిడిపి వారికి, వైసీపీ నుండి టిడిపిలోకి వలస వచ్చిన ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా గోవా, శ్రీలంకలకు విహారయాత్ర కోసం పంపించాడు. ఇలా జగన్ క్యాంపు రాజకీయాలకు దిగడంతో టిడిపి కూడా నాలుగో అభ్యర్థిని పోటీలోకి దించకుండా తెలివైన నిర్ణయం తీసుకొంది.