వచ్చే ఎన్నికల్లో తృతీయ ఫ్రంట్‌కు కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలినట్లు సమాచారం. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయపార్టీలదే హవా అని తేలింది. ఇక ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రుల్లో నలుగురి బలవంతమైన ముఖ్యమంత్రులుగా, భవిష్యత్తులో తృతీయఫ్రంట్ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వేలో తేలింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ లిస్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుకు, మాయావతి వంటి వారికి చోటులేకపోవడంతో ఈ సర్వేపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.