Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు....!

Mon 06th Jun 2016 12:45 PM
keerthy suresh,keerthy suresh with pawan kalyan,keerthy suresh with nani combo,pawan fans  పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు....!
పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు....!
Advertisement
Ads by CJ

గత కొన్నిరోజులుగా 'నేను.. శైలజ' ఫేమ్‌ కీర్తి సురేష్‌ పేరు మీడియాలో బాగా నానుతోంది. అయితే ఈ వార్తల్లో పవన్‌ పేరును ప్రస్తావించడం పట్ల మాత్రం పవన్‌ అభిమానులు మండిపడుతున్నారు. కీర్తి సురేష్‌ తమిళంలో విజయ్‌ హీరోగా రూపొందే చిత్రానికి ఓకే చెప్పిందని, అదే సమయంలో ఆమె పవన్‌ సినిమాకు నో చెప్పిందనేది ఈ వార్తల సారాంశం. మరోవైపు కీర్తిసురేష్‌ నాని హీరోగా దిల్‌రాజు నిర్మాతగా త్రినాధరావు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిందని, కానీ పవన్‌ సినిమాకు నో చెప్పిందని కూడా వార్తలు వస్తున్నాయి. అయినా పవన్‌ స్ధాయి ఎక్కడ? కీర్తి సురేష్‌ స్థాయి ఎక్కడ? వీరిద్దరిని పోలుస్తూ పవన్‌ను తక్కువ చేసి చూపించే వార్తలు రావడం పట్ల పవన్‌ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. అసలు ఎస్‌.జె.సూర్య సినిమాలో పవన్‌ సరసన కీర్తి సురేష్‌ను నటించమని అడిగారా? లేదా? అనే విషయంలో ఇప్పటివరకు అఫీషియల్‌ న్యూస్‌ లేదు. ఏదో కీర్తి సురేష్‌ పేరుకి పవన్‌ పేరును జోడించి పవన్‌కు నో చెప్పింది అని ప్రచారం చేయడం ఏం సమంజసమని పవన్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ