Advertisementt

'కబాలి' వరల్డ్‌ రికార్డ్‌ నిజమేనా?

Wed 08th Jun 2016 02:05 PM
kabali movie,rajinikanth,june 12th audio,malaysia,malay language  'కబాలి' వరల్డ్‌ రికార్డ్‌ నిజమేనా?
'కబాలి' వరల్డ్‌ రికార్డ్‌ నిజమేనా?
Advertisement
Ads by CJ

సౌతిండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, నిర్మాత కలైపులి థాను, దర్శకుడు రంజిత్‌పాల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కబాలి'. ఈచిత్రం టీజర్‌ మే1న విడుదలై ఇప్పటివరకు 23మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. తమిళ టీజర్‌కు 20మిలియన్ల వ్యూస్‌ రాగా, తెలుగు వెర్షన్‌కు 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈనెల 12న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మలేషియా మాతృ భాష 'మలయా'లోనూ డబ్బింగ్‌ చేస్తున్నారు. ఓ ఇండియన్‌ సినిమా మలయా భాషలోకి అనువాదం కావడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అయితే ఈచిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రజనీ ఓ వయసు మళ్లిన డాన్‌ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకి జోడీగా రాధికాఆప్టే ఓ కీలకపాత్రను చేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ