Advertisementt

హీరో పేరు చెప్పలేదు కానీ కర్చీఫ్‌ వేసేశాడు!

Thu 09th Jun 2016 06:05 PM
dil raju,star hero,trivikram srinivas dates,dil raju movies,tollywood star heroes  హీరో పేరు చెప్పలేదు కానీ కర్చీఫ్‌ వేసేశాడు!
హీరో పేరు చెప్పలేదు కానీ కర్చీఫ్‌ వేసేశాడు!
Advertisement
Ads by CJ

దిల్‌ రాజు తెలివైన నిర్మాత. స్టార్‌ హీరోలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాకే చిన్న హీరోల విలువ తెలుసుకున్నారు. అందుకే ఇటీవల ఒక మోస్తారు మార్కెట్‌ ఉన్న వారితోనే చేస్తున్నారు. ఇకపోతే దిల్‌ రాజు తెలివిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డేట్స్‌ బ్లాక్‌ చేసేశారు. 'అ ఆ' సినిమా హిట్‌ కావడంతోటే భవిష్యత్తును బాగా ఊహించారు. త్రివిక్రమ్‌ మార్కెట్‌ బాగా పెరుగుతుందని అంచనావేశారు. అందుకే డేట్స్‌ కమిటయ్యారు. త్రివిక్రమ్‌తో తీయబోయే సినిమాలో స్టార్‌ హీరో నటిస్తాడని ప్రకటించి పేరు మాత్రం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. త్రివిక్రమ్‌ డేట్స్‌పై కర్చీఫ్‌ వేశాడు. దీన్ని కొత్త ఎత్తుగడగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. గతానుభవం దృష్ట్యా దిల్‌ రాజు స్టార్‌ హీరోల డేట్స్‌ కోసం వెంపర్లాడే పరిస్థితి లేదు. కానీ తనకొత్త సినిమాకు స్టార్‌ హీరో కావాలి. త్రివిక్రమ్‌ సినిమా అంటే స్టార్‌ హీరోలు డేట్స్‌ ఇవ్వడానికి ముందుకువస్తారు. వారిలో పవన్‌కల్యాణ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, జూ.ఎన్టీఆర్‌ లాంటి వాళ్ళు లేదా మరో స్టార్‌ హీరో ఉండవచ్చు. వారే ముందుకువచ్చి నటిస్తామంటే దిల్‌ రాజుకు హ్యాపీ. ఈ ఛాయిస్‌ హీరోలకే ఇచ్చి తన పని సులువు చేసుకున్నాడనే మాట పరిశ్రమలో వినిపిస్తోంది. వ్యాపార సూత్రాలు బాగా తెలిసిన దిల్‌ రాజు ఏది చేసిన అందులో సొంతలాభం కచ్చితంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ