Advertisementt

ఆ ఎన్టీఆర్‌, ఈ ఎన్టీఆర్‌ గురించి లక్ష్మీపార్వతి!

Thu 09th Jun 2016 08:11 PM
lakshmi parvathi,jr ntr,sr ntr,lakshmi parvathi shocking comments on jr ntr  ఆ ఎన్టీఆర్‌, ఈ ఎన్టీఆర్‌ గురించి లక్ష్మీపార్వతి!
ఆ ఎన్టీఆర్‌, ఈ ఎన్టీఆర్‌ గురించి లక్ష్మీపార్వతి!
Advertisement
Ads by CJ

సినిమా, రాజకీయరంగాలలో స్వర్గీయ ఎన్టీఆర్‌కు వారసుడిగా బాలకృష్ణను చెబుతారు. ఎన్టీఆర్‌ బతికున్నకాలంలో కూడా తన వారసుడు బాలయ్యే అని ప్రకటించాడు. ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఈ తరం హీరోల్లో నందమూరి వారసుడిగా పేరు తెచ్చుకుంటూ మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఘనత జూనియర్‌ ఎన్టీఆర్‌కు దక్కుతుంది. తాతయ్య నటన, రూపం ఎన్టీఆర్‌లో కనిపిస్తుంటాయని అందరూ ఆంటూ ఉంటారు. కానీ ఈ పోలికను ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి కొట్టిపడేశారు. అంతేకాదు.. జూనియర్‌ ఎన్టీఆర్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇప్పటివరకు జూనియర్‌ని ఎవ్వరూ ఇంతలా టార్గెట్‌ చేయలేదంటే నమ్మశక్యం కాదు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీపార్వతి ఈ షాకింగ్‌ కామెంట్స్‌ చేయడం గమనార్హం. ఆమె మాట్లాడుతూ... ఎన్టీఆర్‌కు, జూనియర్‌ ఎన్టీఆర్‌కు పోలికా? ఇద్దరినీ పక్కన పక్కనపెట్టి చూస్తే ఎవ్వరూ ఆ మాటలు అనలేరు. ఆయన ఆజానుబాహుడు. ఈ కుర్రాడు అరజాన బాహుడు. ఇద్దరికీ నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క జూనియర్‌ ఎన్టీఆరే కాదు.. ఆయన కొడుకులు, మనవళ్లలో ఎవ్వరికీ ఆయన పోలికలు, నటన రాలేదు అని కామెంట్‌ చేసింది. కానీ ఈ మాటలు చాలా దారుణమని, ఇప్పటికే తమ అందం, నటనతో బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెలుగుతున్న విషయాన్ని చాలా మంది గుర్తుచేస్తూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యలను అసందర్బంగా, కావాలని పనిగుట్టుకొని చేసిన విధంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ