1978లో ఈనాడు దినపత్రిక ద్వారా తన జర్నలిజం ప్రస్దానాన్ని మొదలు పెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆ తర్వాత ఎన్నో ఉన్నత పదవుల్లో పనిచేశారు. గత ఏడేళ్లుగా ఆయన ఎన్టీవీలో ఉదయం లైవ్ షో విత్ కేయస్‌ఆర్ అనే రాజకీయ చర్చా వేదిక నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఎంతో పాపులర్ అయింది. కానీ ఈ కార్యక్రమంలో ఆయన పనిగట్టుకొని టిడిపిని కార్నర్ చేస్తున్నాడని, టిడిపి నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒంటెద్దుపోకడలు పోతున్నాడని గత కొంతకాలంగా టిడిపి ప్రభుత్వం ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో ఆ చానెల్ ఎండీ నరేంద్రచౌదరిపై నారా లోకేష్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడని సమాచారం. దీంతో తన వల్ల చానెల్‌కు, చానెల్ యాజమాన్యానికి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఎన్టీవీకి రాజీనామా చేయాలని భావించారు. కానీ కొద్దికాలం ఆ చానెల్ యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కానీ అప్పటికీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయన గౌరవసంపాదకులు పదవికి రాజీనామా చేశారు. మరోపక్క ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన సాక్షి చానెల్ ఆయన్ను తమ చానెల్‌లో లైవ్ షో విత్ కేయస్‌ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరినట్లు సమాచారం. దానికి ఆయన కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. 13వతేదీ సోమవారం నుండి సాక్షి చానెల్‌లో కేయస్‌ఆర్ షో మొదలుకానుంది. ఎన్టీవీ లో షో కి అడ్డుపడిన వారు మరి సాక్షి షో కి అడ్డుపడరా! చూద్దాం.