Advertisementt

పాపం చిరంజీవి కష్టాలు తీరేలా లేవుగా!

Fri 10th Jun 2016 09:06 AM
chiranjeevi 150th heroine,vv vinayak  పాపం చిరంజీవి కష్టాలు తీరేలా లేవుగా!
పాపం చిరంజీవి కష్టాలు తీరేలా లేవుగా!
Advertisement
Ads by CJ

మన తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ల కొరత రోజురోజుకీ ముదురుతోంది. వయసు పై బడిన బాలకృష్ణ, చిరంజీవి లాంటోల్లకయితే ఆ కష్టం చెప్పనలవి కానిది. కుర్ర హీరోలకు అక్కడి నుండో ఇక్కడి నుండో తెచ్చి ఓ పిల్లని కట్టబెట్టోచ్చు కానీ వెటరన్ స్టార్స్ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇక అసలు విషయానికి  వస్తే బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి కోసం చివరంటా హీరోయిన్ వేట కొనసాగించిన దర్శకుడు క్రిష్ ఆఖరుకి వచ్చేసరికి పాత పచ్చడే రుచి అన్నట్లుగా ఎప్పుడో మూలన పడేసిన శ్రీయకు కొత్త కోక కట్టి మా రాజకుమారి అంటున్నాడు. బాలయ్య కాబట్టి ఇలా సర్దేసుకున్నాడు కానీ చిరంజీవికి మాత్రం అది ఆనేలా లేదు. అందుకే మెగా 150వ చిత్రానికి ముందుగా నయనతార అటు తరువాత దీపికా పడుకొనే అనుకున్నారు. ఇప్పుడేమో వాళ్ళెవరూ లేరు, ఇంకా మాకు హీరోయిన్ కావలెను అని చెప్పుకుంటున్నారు. అందుకేనో దర్శకుడు వీవీ వినాయక్ ముందుగా చిరంజీవి పై సోలోగా తీయాల్సిన దృశ్యాలు, అటు పై క్యారెక్టర్ ఆర్టిస్టులతో చేయాల్సిన సీన్లు తీసేసిన తరువాత హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ ఫైనల్ చేస్తానంటున్నాడు. అంతవరకూ చిరు ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ