కడప జిల్లాలో పట్టున్న నాయకుడు, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రారెడ్డి త్వరలో టిడిపిలో చేరనున్నారని సమాచారం. ఈ విషయంలో ఆయన ఇప్పటికే నారా లోకేష్‌తో కూడా మంతనాలు జరిపినట్లు సమాచారం. తనకు అత్యంత సన్నిహుతుడైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కూడా విమర్శించేంత తెగువ, వ్యక్తిత్వం ఆయన సొంతం. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని కూడా ఎదుర్కొని ఆయన గెలిచారు. డిఎల్ కనుక సైకిల్ ఎక్కితే కడప జిల్లాలో మరలా టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయం అంటున్నారు. కానీ ఆయన టిడిపిలో చేరికను మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుదాకర్ యాదవ్ అడ్డుకుంటున్నాడు. ఆయన ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు దగ్గరి బంధువు కావడంతో సుదాకర్‌యాదవ్ డిఎల్ టిడిపి చేరికను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో మైదుకూరు నుండి సుధాకర్ యాదవ్ పోటీ చేశాడు. ఆయనకు మద్దతునిస్తానని చెప్పిన డిఎల్ చివరి క్షణంలో ఆయనకు హ్యాండిచాడని అంటున్నారు. మొత్తానికి డిఎల్ చేరిక కొంత ఆలస్యమైనప్పటికీ లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాడని ఆయన అభిమానులు అనందంతో చెబుతున్నారు.