'భలే భలే మగాడివోయ్' హిట్ తరవాత నాని చేస్తున్న సినిమా జెంటిల్‌మన్. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని 17న రిలీజ్ కి రెడీ గా వుంది. సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ 'యు' సర్టిఫికేట్ ఇచ్చింది. క్లీన్ 'యు' అంటే నాని మరోసారి ఫ్యామిలీ ఆడియన్సు ని బుట్టలో వెయ్యబోతున్నట్లే. ఇక ఈ సినిమాతో నాని మళ్లీ హిట్ కొట్టడానికి రెడీ గా ఉన్నాడన్న మాటే. ఈ సినిమాలో నాని విలన్ గాను మరియు హీరో గాను రెండు వేరియేషన్స్ వున్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నాని సరసన నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని కాంబినేషన్ లో ఇది 2వ సినిమా. వీరిద్దరి మొదటి సినిమా అష్టాచెమ్మ వీరిద్దరికీ హిట్ ఇచ్చింది. ఈ సినిమా కూడా వీరికి మరో హిట్ ఇస్తుందని యూనిట్ అంతా ఎదురుచూస్తున్నారు.