'భలే భలే మగాడివోయ్' చిత్రంతో రాత్రికి రాత్రి పెద్ద స్టార్‌గా, నేచురల్ స్టార్‌గా మారిపోయాడు నాని. ప్రస్తుతం నాని తనని నటుడిని చేసిన గురువు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'జెంటిల్‌మేన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నాని ఓ క్యారెక్టర్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను కూడా పోషించాడని సమాచారం. ఇందులో నాని సరసన సురభి, నివేదా థామస్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలకు సిద్దమవుతోంది. నానికి పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని యుఎస్‌లో 125స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారని సమాచారం. ఈ ఒక్క విషయమే నానికి పెరిగిన క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో నాని మరో హిట్‌ను కొట్టడం ఖాయం అంటున్నారు. తనకు మంచి క్రేజ్, ఇమేజ్ వచ్చినా కూడా నాని ఏ చిత్రాలంటే ఆ చిత్రాలు ఒప్పుకోకుండా వెరైటీ కాన్సెప్ట్స్‌ను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మొత్తానికి నాని ఈసారి 'జెంటిల్‌మేన్'తో ఎలాంటి హిట్ కొడతాడో వేచిచూడాల్సివుంది.