బాలకృష్ణకు సినిమాల్లో పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం తప్ప నిజజీవితంలో సరిగ్గా మాట్లాడటం చేతకాదు. ముఖ్యంగా పలువురిని ఉద్దేశించి మాట్లాడాల్సిన ఫంక్షన్లలో, వేడుకల్లో ఆయన ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. దాంతో ఆయన వ్యాఖ్యలు పలుసార్లు వివాదాలకు కారణం అవుతుంటాయి. అయితే తన 56వ జన్మదిన వేడుకలను యూఎస్‌లో జరుపుకున్న బాలయ్య అక్కడ చేసిన ప్రసంగం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వారికి తెల్లన్నం అంటే ఏమిటో తెలియదనే అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెబుతూ ఒళ్లు మైమరిచిపోయిన ఆయన తెలంగాణ ప్రజలకు తెల్ల అన్నం అంటే ఏమిటో తెలియదని, తన తండ్రి ఎన్టీఆర్ వల్లే తెలంగాణ వాసులకు తెల్ల అన్నం తినే స్దాయి వచ్చిందని, నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లడానికి ఎన్టీఆరే కారణం అనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. గతంలో కూడా చంద్రబాబు రాయలసీమ ప్రజల గురించి మాట్లాడుతూ... గొడ్డుకారం తినే రాయలసీమ ప్రజలకు తెల్లన్నం తినిపించిన ఘనత ఎన్టీఆర్‌దే అని వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరి బాలయ్య వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సివుంది...!