డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకు వచ్చి అద్రుష్టం కొద్దీ హీరో అయ్యాడు నాని. ఇక హీరోగానే సెటిల్ అవ్వాలని అటువైపే తన దృష్టిని కేంద్రీకరించి న్యాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. 'భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీర ప్రేమ గాథ' వంటి చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం నాని, 'అష్టా చమ్మా' సినిమాతో తనకు లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'జెంటిల్మెన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేత థామస్ అనే ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ను షేర్ చేసుకున్నాడు మన హీరో. ఈ సినిమాలో నాని, సురభిని తన భుజాలపై ఉప్పు ఎక్కించుకొని పరిగెత్తే సీన్ ఉంటుందట. అయితే డైరెక్టర్ యాక్షన్ చెప్పకముందే సురభి, నాని భుజంపై ఉండేదట. సురభికి సినిమా పట్ల చాలా డెడికేషన్ ఉంది కాని యాక్షన్ చెప్పిన తరువాత నా భుజంపై ఉంటే బావుండేదని చమత్కరించాడు నాని. అయినా.. సురభి లైట్ వెయిట్ కదే.. పెద్దగా బరువు అనిపించలేదని కామెంట్ చేశాడు. ఈ సినిమాను జూన్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.